March 12, 2011 |వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

March 12, 2011 | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…
పార్టీ పతాక ఆవిష్కరణ వైఎస్సార్ చిత్రపటానికి నివాళులు
March 12, 2011 | నందిగామ, ఆంధ్రప్రభ : నందిగామ నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. నందిగామ పట్టణంతో పాటు కంచికచర్లలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ఆధ్వర్యంలో మహానేత రాజశేఖర రెడ్డి చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఆవిర్భావ దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు మాట్లాడుతూ, 2011 మార్చి 12న వైఎస్సార్ సమాధి వద్ద ప్రారంభమైన ఉద్యమం తరువాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక శక్తిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎదిగిందని తెలిపారు. ఆ పార్టీ స్థాపనకు ప్రేరణగా మహానేత వైఎస్సార్ ప్రజాసేవ, సంక్షేమ పాలన నిలిచాయని పేర్కొన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రజలకు విస్తృత సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేసిన నాయకుడు వైఎస్సార్ అని గుర్తుచేశారు. 2009లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణం రాష్ట్ర ప్రజలను తీవ్ర విషాదంలోకి నెట్టిందన్నారు. ఆ సమయంలో ఆయన అభిమానులు, మద్దతుదారులకు అండగా నిలవాలనే సంకల్పంతో జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారని వివరించారు. ఆ తర్వాత ప్రజా సంకల్ప పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుని రాజకీయాల్లో నైతిక విలువలకు ప్రాధాన్యతనిస్తూ పార్టీ ముందుకు సాగిందని చెప్పారు.

సామాజిక న్యాయం, సంక్షేమ పాలన లక్ష్యాలతో పార్టీ తన ప్రయాణాన్నికొనసాగిస్తోందని పేర్కొన్నారు. పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


CLICK HERE TO READ MORE : Expo-2026 | రూ.100 కోట్లతో అమ్యూజ్‌మెంట్ పార్క్, రిసార్ట్ ప్రాజెక్ట్
