ఈమె కేంద్ర కమిటీ సభ్యురాలి బాడీగార్డ్
ఆంధ్రప్రభ. భోపాల్ : మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యురాలు రామ్ దర్ అంగరక్షక విభాగంలోని ఓ యువ మహిళా మావోయిస్టు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఎదుట లొంగిపోయింది. ఈ సమాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చత్తీస్ గడ్ కు చెందిన 23 ఏళ్ల సునీతక్క బాలాఘాట్ జిల్లాలో హాక్ ఫోర్స్ ఎదుట లొంగిపోయింది.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2023 ఆగస్టులో కొత్త నక్సలైట్ లొంగుబాటు, పునరావాస విధానాన్ని అమలు చేసిన తర్వాత ఇదే తొలి మావోయిస్టు లొంగుబాటు. ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి ప్రాంతం విర్మాన్ గ్రామానికి చెందిన విస్రు కుమార్తె సునీత 2022లో మావోయిస్టు పార్టీలో చేరింది.
బాలఘాట్ జిల్లా కేంద్రానికి దాదాపు 110 కి.మీ దూరంలోని మారుమూల చౌరియా ప్రాంతంలో నిర్మాణంలోని హాక్ ఫోర్స్ శిబిరంలో శుక్రవారం ( అక్టోబర్ 31న) తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో లొంగిపోయింది.
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, సునీత ఏరియా కమిటీ సభ్యురాలు (ACM) ఇంద్రావతి , మాడ్ ప్రాంతాలలో పనిచేస్తున్న సీనియర్ మావోయిస్టు నాయకురాలు సెంట్రల్ కమిటీ సభ్యురాలు (CCM) రామ్‌దర్ అంగరక్షక దళం సభ్యురాలు.సునీతక్క లొంగిపోయే సమయంలో మూడు మ్యాగజైన్‌లతో పాటు INSAS రైఫిల్‌ను తీసుకెళ్లింది.
సునీత 2022లో నిషేధిత మావోయిస్టు సంస్థలో చేరింది. మాడ్ ప్రాంతంలో ఆరు నెలల ఆయుధ , సైద్ధాంతిక శిక్షణ పొందింది. ఇంద్రావతి, మాడ్ , డారెకాసా అటవీ ప్రాంతాలలో పనిచేస్తున్న రామ్‌దర్ వ్యక్తిగత భద్రతా బృందంలో సభ్యురాలిగా సునీతక్కను మావోయిస్టు పార్టీ నియమించింది. ఇక సునీతకు పునరావాస ఏర్పాట్లు చేస్తున్నట్టు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.

