• టాపార్డర్ లో తీవ్ర పోటీ..
  • సెలెక్టర్లుకు తలనొప్పిగా మారిన భారత జట్టు ఎంపిక..

అండర్సన్- టెండూల్క‌ర్ ట్రోఫి ముగిసింది. ఐదు టెస్టుల సిరీస్ ను భారత్ 2-2తో ముగించింది. ఇక, ఇప్పుడు అందరి దృష్టి ఆసియా కప్ (Asia Cup) పై పడింది. టీ20 ఫార్మాట్ లో జరిగే ఆసియా కప్ యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభంకానున విష‌యం తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) జరగనుంది. ఐసీసీ టోర్నీకి ఇంకా ఐదు నెలల సమయం ఉన్న‌ప్ప‌టికీ కాంబినేషన్ ను డిసైడ్ చేయడానికి ఇదే సరైన సమయం. అయితే, ఆ పని అంత సులభం కాదు. భారత టీ20 జట్టులో తీవ్ర పోటీ ఉండటమే అందుకు కారణం. జట్టులో ప్రతి స్థానానికి ఇద్దరు లేదా ముగ్గురు పోటీ ఉండటంతో ఎవరికి చాన్స్ ఇవ్వాలన్నది ప్రశ్నార్థకంగా నెలకొంది. ఈ క్రమంలోనే ఆసియా కప్ కు భారత జట్టు (Indian cricket team) ఎంపిక సెలెక్టర్ల (selectors)కు తలనొప్పిగా మారింది. ఈ నెల రెండో వారంలో లేదా మూడో వారంలో జట్టును ప్రకటించే అవకాశం ఉంది.

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ (Suryakumar) ఆసియా కప్ ఆడటంపై అనుమానం నెలకొంది. ఇటీవల సూర్య జర్మనీలో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ (Sports Hernia Surgery) చేయించుకున్నాడు. ప్రస్తుతం అతను బెంగళూరులోని సెంటర్ ఆఫ్ రిహాబిలిటేషన్లో ఉండనున్నాడు. ఆసియా కప్ కు ఇంకా నెలరోజుల సమయం ఉన్నప్పటికీ అతను పూర్తి స్థాయి ఫిట్ నెస్ సాధిస్తాడా..? అన్నది తెలియదు. ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీ (Duleep Trophy) కి అతను దూరమయ్యాడు. ఒకవేళ ఆసియా కప్ కు కూడా అందుబాటులో లేకుంటే కెప్టెన్ ఎవరన్నది..? మరో ప్రశ్న. గతంలో హార్దిక్ పాండ్యా (Hardik Pandya) టీ 20 కెప్టెన్ గా ఉన్నాడు. మరోవైపు, వైట్ బాల్ ఫార్మాట్ లో గిల్ వైస్ కెప్టెన్. సూర్య దూరమైతే గిల్ సారథ్యం వహించే అవకాశాలు ఎక్కువగా క‌న‌బ‌డుతోంది.

చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar), హెడ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) కు టాపార్డర్ ఎంపిక పెద్ద సవాల్ గా మారింది. టాపార్డర్ లో తీవ్ర పోటీ ఉంది. యశస్వి జైశ్వాల్, అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సంజూ శాంసన్ ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. ఇషాన్ కిషన్, రుతురాజ్ గ్వైకార్డ్ టాపార్డర్ లో తీవ్ర పోటీ ఉంది. గైక్వాడ్, తిలక్ వర్మ, సాయి సుదర్శన్ కూడా పలు మ్యాచ్ లో టాపార్డర్ (taporder) లో బ్యాటింగ్ చేశారు. కాబట్టి, ఎవరికి చోటు దక్కుతుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెల‌కొంది. ఐపీఎల్ ప్రదర్శనను పరిగణలోకి తీసుకుని ఆటగాళ్లను ఎంపిక చేయనున్నట్టు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇంగ్లాండ్ లో వికెట్ కీపర్, అవకాశం వచ్చినప్పుడల్లా రాణిస్తున్నా శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ను టెస్టులు, టీ20ల్లో విస్మరిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంటుంది. ఇటీవల అతని ప్రదర్శనను దృష్టి పెట్టుకుంటే అయ్యర్ కు చోటు దక్కడం ఖాయమే అని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఏడాది ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) ను అయ్యర్ ఫైనల్ కు చేర్చాడు. 17 మ్యాచ్ లో 604 రన్స్ చేశాడు. గత 12 నెలల్లో 25 ఇన్నింగ్స్లో 949 పరుగులు చేశాడు. అయితే, అయ్యర్ ను ఎంపిక చేయాలంటే తిలక్ వ‌ర్మ (Tilak Verma) ను తప్పించాల్సి ఉంటుంది. తిలక్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇటీవల కౌంటీ చాంపియన్షిప్ లో రెండు శతకాలు అలాగే, గత 12 నెలల్లో మూడు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు. కాబట్టి, అయ్యర్ కు తిలక్ నుంచి గట్టీ పోటీనే ఉంది.

మరోవైపు, భారత జట్టును ప్రకటించిన ప్రతిసారి సంజూ శాంసన్ (Sanju Samson) గురించి చర్చ జరుగుతుంటుంది. ఇటీవల అతని ఫామ్ గొప్పగా లేదు. ఇంగ్లాండ్ జరిగిన చివరి టీ20 సిరీస్ లో అతను పేలవ ప్రదర్శన చేశాడు. గత 21 ఇన్నింగ్స్ లో ఐదుసార్లు డకౌటయ్యాడు. అనేక సార్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు. అయితే, వికెట్ కీపర్ కావడం అతనికి అడ్వాంటేజ్.

బ్యాటర్ రిషబ్ పంత్ (Rishabh Pant) గాయపడిన విషయం తెలిసిందే. బంతి పాదానికి బలంగా తాకడంతో అతను ఐదో టెస్టుకు కూడా దూరమయ్యాడు. పంత్ కోలుకోవడానికి ఆరు వారాల సమయం పడుతుందని వైద్యులు చెప్పినట్టు తెలుస్తోంది. కాబట్టి, అతను ఆసియా కప్ ఆడే చాన్స్ లు దాదాపుగా లేనట్టే. ఈ పరిస్థితుల్లో వికెట్ కీపర్ ఎవరు..? అన్న ప్రశ్న త‌లెత్త‌డం సహజమే. సంజూ శాంసన్, కేఎల్ రాహుల్, జితేశ్ శర్మ, ధ్రువ్ జురెల్, ప్రభ్సిమ్రాన్ సింగ్ రూపంలో అనేక ఆప్షన్స్ ఉన్నాయి. వీరిలో ఎవరు మెయిన్ వికెట్ కీపర్ గా ఎంపికవుతారో చూడాలి.

Leave a Reply