Mantralayam l శ్రీ రాఘవుడి హుండీ ఆదాయం 3కోట్ల,8లక్షలు

Mantralayam l శ్రీ రాఘవుడి హుండీ ఆదాయం 3కోట్ల,8లక్షలు
Mantralayam l మంత్రాలయం, ఆంధ్రప్రభ: ప్రసిద్ధి పుణ్య క్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం హుండీ ఆదాయం 3,08,37,571/- వచ్చినట్లు శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. 21 రోజులకు హుండి లెక్కింపును నిర్వహించారు. భక్తులు కానుక రూపంలో సమర్పించిన హుండీ ఆదాయం కరెన్సీ2,98,13,571/- నాణెములు 10,24,000 మొత్తం రూ 3,08,37,571 బంగారం (13 గ్రాములు), వెండి1018 గ్రాములు వచ్చినట్లు మేనేజర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు మఠం సిబ్బంది సెక్యూరిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
