ప్రజాసేవలో కౌన్సిలర్..

ప్రజాసేవలో కౌన్సిలర్..

మంథని టౌన్: మంథని మున్సిపల్ నాలుగో వార్డ్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ మద్దికట్ల స్రవంతి రమేష్ ప్రజాసేవలో దూసుకవెళ్తున్నారు. బుధవారం మంథని మున్సిపల్ పరిధి లైన్ గడ్డలో వీధి దీపాలను మున్సిపల్ సిబ్బందితో కౌన్సిలర్ మరమ్మత్తులు చేయించారు. కౌన్సిలర్ భర్త కాంగ్రెస్ నాయకులు ఎరుకల రమేష్ బాబు స్వయంగా మరమ్మత్తులను పర్యవేక్షించారు. గెలిచిన వెంటనే ప్రజాసేవలో వారు ముందుండడం చూసి వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ మాట్లాడుతూ…. మంత్రి శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు సహకారంతో వార్డును మంథని మున్సిపల్ లోని అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని తెలిపారు. వార్డు అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని వారు పేర్కొన్నారు.

Leave a Reply