దక్షిణ భారత సినీ రంగంలో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం.. ఇటీవల కమల్ హాసన్ హీరోగా తెరకెక్కించిన Thug Lifeతో పెద్దగా విజయం సాధించలేకపోయారు. అయితే ఇప్పుడు ఆయన మరోసారి ప్రేక్షకుల ముందుకు కొత్త ప్రాజెక్ట్‌తో రానున్నారు.

కోలీవుడ్ సమాచారం ప్రకారం, ధృవ్ విక్రమ్ హీరోగా… చెన్నై నేపథ్యంలో జరిగే పోలీస్ డ్రామా-ప్రేమకథగా మణిరత్నం ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ప్రేమకథా అంశాలను సహజంగా మిళితం చేయడం మణిరత్నం ప్రత్యేకత, కాబట్టి ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇక‌ ఈ సినిమాలో ధృవ్ విక్రమ్ కి జంట‌గా.. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా ఎంపికయ్యారు. మణిరత్నం టేకింగ్‌కు మరో ప్లస్‌గా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 2025లో షూటింగ్ మొదలుకొని, 2026 ఆరంభంలో విడుదల కానుంది. మణిరత్నం దర్శకత్వం, రెహమాన్ సంగీతం కలయికతో మరో క్లాసిక్ ఎంటర్టైనర్‌ రానుందనే ఆశలు పెరుగుతున్నాయి.

Leave a Reply