Mangapeta | ఇసుక వేస్తే రాలనంత….

Mangapeta | ఇసుక వేస్తే రాలనంత….

Mangapeta | మేడారం / మంగపేట, ఆంధ్రప్రభ : నాలుగు రోజులు పాటు జరగనున్న మేడారం మహా జాతరకు మొదటి రోజైన బుధవారం పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. బుధవారం మేడారం జాతరకు వచ్చిన భక్తులతో జంపన్నవాగుకు ఇరువైపులా కిక్కిరిసిపోయింది. బుధవారం కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి సారలమ్మ రానుంది. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు మేడారానికి పోటెత్తారు. దీంతో మేడారం జాతరకు విచ్చేసిన భక్తులతో మేడారం, రెడ్డిగూడెం, కొత్తూరు, ఊరట్టం తదితర ప్రాంతాలన్నీ ఇసుక వేస్తే రాలనంత భక్త జనంతో సందడిగా మారింది.

Leave a Reply