Mandali Buddhaprasad | రోడ్లకు మహర్దశ
- పులిగడ్డ -వేకనూరు రోడ్డుకు రూ.కోటి 53 లక్షలు మంజూరు
- అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
Mandali Buddhaprasad | అవనిగడ్డ, ఆంధ్రప్రభ : పులిగడ్డ -వేకనూరు రోడ్డుకు రూ.కోటి 53 లక్షలు మంజూరైనట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సోమవారం తెలిపారు. స్టేట్ హైవేల అభివృద్ధిలో భాగంగా గుడివాడ – చల్లపల్లి – టీ.కొత్తపాలెం స్టేట్ హైవేలో అవనిగడ్డ మండలం పులిగడ్డ నుంచి వేకనూరు వరకు 49.6 కిలోమీటర్ నుంచి 58వ కిలోమీటర్ వరకూ 8.400 కిలోమీటర్లు పొడవున ఇంప్రూవ్మెంట్ (అభివృద్ధి) పనులకు ప్రభుత్వం రూ.కోటీ 53 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు.

