Manchrial | మంత్రి ప‌ద‌వి ఇవ్వాల్సిందే… అన్యాయం చేస్తే స‌హించ‌బోనుః ఎమ్మెల్యే ప్రేమ్ సాగ‌ర్ రావు

మంచిర్యాల – మంత్రివర్గంలో నాకు చోటు లేకుంటే.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు అన్యాయం చేసినట్టే అని కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానంపై ప్రేమ్‌సాగర్‌ రావు మండిపడ్డారు. ఇంద్రవెల్లి సభతో పార్టీకి ఊపిరిపోశానని గుర్తు చేశారు. అధిష్టానం తనకు అన్యాయం చేస్తే సహించనని స్పష్టం చేశారు. ఆదివాసీలకు, పార్టీ కార్యకర్తలకు ఊపిరిగా నిలిచిన తనకే అన్యాయం చేస్తారా? అని ప్రశ్నించారు. పదేళ్లు పార్టీని కాపాడుకుంటే ఇదేనా గౌరవం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ప్రేమ్ సాగర్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్, బీజేపీ అన్ని పార్టీలు తిరిగి వచ్చిన వారు కూడా ఇవాళ మంత్రి పదవి అడుగుతున్నారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ పై పరోక్షంగా సెటైర్లు వేశారు. అన్ని పార్టీలు తిరిగి వచ్చిన వారు తనను టార్గెట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఓ కుటుంబం మంత్రి పదవి రాకుండా నా గొంతు కోసేందుకు ప్రయత్నిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. జై బాబు జై భీమ్ జై సమ్మిదాన్ సభలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలోనే ప్రేమ్ సాగర్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply