మంచిర్యాల సీనియర్‌ న్యాయవాది సిరిపురం రాజేష్‌కు హైదరాబాద్‌లో సన్మానం

మంచిర్యాల, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లాకు చెందిన సీనియర్‌ న్యాయవాది, కాంగ్రెస్‌ పార్టీ అధికార జిల్లా ప్రచార కార్యదర్శి సిరిపురం రాజేష్‌కు హైదరాబాద్‌లో ఘన సన్మానం లభించింది. శనివారం హైదరాబాద్‌లోని వాసవి క్లబ్‌ ఇంటర్నేషనల్‌లో నిర్వహించిన రీజినల్‌ సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. అనంతరం వాసవి క్లబ్‌ సభ్యులు రాజేష్‌ను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా సిరిపురం రాజేష్‌ మాట్లాడుతూ.. వాసవి క్లబ్‌ ఇంటర్నేషనల్‌ సభ్యులు తెలంగాణ రాష్ట్రంలో చురుకైన పాత్ర పోషిస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో తమవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. మరింత ఉత్సాహంతో సేవా కార్యక్రమాలను చేపట్టి, సమాజంలోని ఇతరులకు సహాయపడేలా సేవా దృక్పథాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.

మంచిర్యాల ప్రాంతానికి చెందిన వ్యక్తిగా అంతర్రాష్ట్ర వేదికపై ముఖ్య వక్తగా తన సేవలను గుర్తించి సన్మానించడం అభినందనీయమని రాజేష్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో వాసవి క్లబ్‌ ఇంటర్నేషనల్‌ బాధ్యులు బాదామి శ్రీధర్‌, సుప్రజ తదితరులు పాల్గొన్నారు.