ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : న‌ల్ల‌గొండ (Nalgonda) జిల్లాలో లైంగిక దాడికి పాల్ప‌డిన వ్య‌క్తుల‌కు ఇటీవ‌ల వ‌ర‌స‌ జైలు శిక్షలు వేస్తూ పోక్సో కోర్టు (POCSO Court) న్యాయ‌మూర్తి రోజా ర‌మ‌ణి సంచ‌ల‌న తీర్పు ఇస్తున్నారు. ఈ క్ర‌మంలోనే సోమ‌వారం ఓ నిందితుడికి 21ఏళ్ల‌ జైలు శిక్ష, రూ.30 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.

2018లో నల్లగొండ జిల్లా చిట్యాల పోలీస్ స్టేషన్ (Chityal Police Station) పరిధిలో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్ప‌డిన‌ రాములు పై కేసు న‌మోదైంది. కేసును విచారించిన పోక్సో కోర్టు న్యాయమూర్తి రోజా రమణి నిందితునికి జైలు శిక్ష, జరిమానాతో పాటు లీగల్ అథారిటీ (Legal Authority) ద్వారా బాధితురానికి రూ. పది లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. గ‌త ఏడాది కాలంగా 19 మంది కామాంధుల‌కు క‌ఠిన కారాగార శిక్ష విధించారు.

Leave a Reply