Mamada కొరిటికల్ పంచాయతీ కార్యదర్శిగా రాజశేఖర్ బాధ్యతల స్వీకరణ
Mamada కొరిటికల్ పంచాయతీ కార్యదర్శిగా రాజశేఖర్ బాధ్యతల స్వీకరణ
మామడ(Mamada ), ఆంధ్రప్రభ:
మండలంలోని కొరిటికల్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా దోనిపెల్లి రాజశేఖర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు కొరిటికల్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన రవి డిప్యూటేషన్‌పై మండలంలోని తోడిగూడ గ్రామ పంచాయతీకి బదిలీ కాగా, తోడిగూడ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న దోనిపెల్లి రాజశేఖర్ డిప్యూటేషన్‌పై కొరిటికల్‌కు వచ్చారు.
ఈ సందర్భంగా కొరిటికల్ గ్రామ సర్పంచ్ మోతె రాజేశ్వర్, పంచాయతీ సిబ్బంది నూతన కార్యదర్శి రాజశేఖర్‌కు ఘన స్వాగతం పలికి సన్మానించారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.
