Mamada | సమస్యల పరిష్కరానికి కృషి చేయాలి…

Mamada | సమస్యల పరిష్కరానికి కృషి చేయాలి…

Mamada | మామడ, ఆంధ్రప్రభ : గ్రామాల్లో త్రాగునీరు, మురికి కాలువల పరిష్కరానికి కృషి చేయాలని మామడ ఎంపిడివో వెల్మ సుశీల్ రెడ్డి అన్నారు. మంగళవారం పొన్కల్ గ్రామంలోని ఇందిరమ్మ కాలనిలో నిర్మిస్తున్న మురికికాలువలను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రధాన సమస్యలను ముందుగా పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి రాజారెడ్డి, ఎంపివో హరిక్రిష్ణ, కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి, వార్డ్ సభ్యులు లహరి గంగారెడ్డి, సుధాకర్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ ఉపేందర్ ఉన్నారు.

Leave a Reply