Mamada | సదర్మాట్ బ్యారేజీ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీల‌న‌…

Mamada | సదర్మాట్ బ్యారేజీ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీల‌న‌…

  • మంత్రి జూపల్లి కృష్ణారావు

Mamada | మామడ, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 16న నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రతిష్టాత్మక సదర్మాట్ బ్యారేజీని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ఈ రోజు బ్యారేజీ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి హెలిప్యాడ్, ప్రారంభోత్సవ వేదిక, భద్రతా ఏర్పాట్లు, బ్యారేజీ గేట్లను పరిశీలించారు. బ్యారేజీ ఆయకట్టు రైతాంగ కల సాకారమవుతున్న తరుణంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హుందాన్, ఎమ్మెల్యే , డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు, కలెక్టర్ అభిలాష్ అభినవ్, ఎస్పీ జానకి షర్మిల, నీటిపారుదల శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply