ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: సీఎం నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని తెలంగాణ మాజీ మంత్రి, మల్కాజిగిరి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Chamakura Mallareddy) కొనియాడారు. మంగళవారం(Tuesday) ఉదయం తిరుమల వెంకటేశ్వరస్వామి(Tirumala Venkateswara Swamy) వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ చంద్రబాబు ఏపీలో అభివృద్ధిని పరుగులు తీయిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) కూడా ఏపీ అభివృద్ధికి లక్షల కోట్లు కేటాయిస్తున్నారు. ఈ కలయికతో రాష్ట్రం అభివృద్ధి శిఖరాలు అధిరోహిస్తోంది అని మల్లారెడ్డి వాఖ్యనించారు.
ప్రతి ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునే ఆనవాయితీ ఉందని ఆయన తెలిపారు. గత ఏడాది స్వామివారిని దర్శించుకున్నప్పుడు విద్యా రంగం అభివృద్ధి కావాలని కోరుకున్నానని, తన ఆధ్వర్యంలో దేశంలోనే మూడు ప్రముఖ డీమ్డ్ యూనివర్శిటీలు విజయవంతంగా నడుస్తున్నాయని వెల్లడించారు. తెలంగాణలో గత పదేళ్ల పాలనలో మాజీ సీఎం కేసీఆర్(KCR) అపూర్వమైన అభివృద్ధిని సాధించారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో రియల్ ఎస్టేట్ మార్కెట్ కాస్త మందగించిందని, గతంలో ఆంధ్రాలో ఉన్న ఆస్తులను విక్రయించి హైదరాబాద్(Hyderabad)కు వచ్చేవారు కానీ ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధికారంలోకి వస్తే గతంలోలాగా తెలంగాణలో తిరిగి అభివృద్ధి జోరందుకుంటుందన్నారు.