పెద్దిలో మలయాళ నటి స్వసిక‌

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : గ్లోబ‌ల్ స్టార్ రామ్ చరణ్ (Global star Ram Charan) ప్రస్తుతం పెద్ది (Pedi)చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ సినిమాను బుచ్చిబాబు (Buchi Babu) డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్రకు మలయాళ నటి స్వసికా(Malayalam Actress Swasika)ను సంప్రదించారు. అయితే, ఆ పాత్రను స్వసికా రిజెక్ట్ చేయడం ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారి తీసింది. అయితే ఆమెకు ఆఫర్​ వచ్చింది రామ్ చరణ్ తల్లి పాత్ర. చరణ్ 40 ఏళ్లు, స్వసికా 33 ఏళ్లు. వయసులో తక్కువ తేడా ఉండటంతో, తనకన్నా ఏడు ఏళ్లు పెద్దవాడికి తల్లి పాత్రలో నటించడం సరైనది కాదని భావించి, స్వసికా ఆ పాత్రను నిరాకరించారని సమాచారం. పలుమార్లు టీమ్ అభ్యర్థించినా ఆమె తన నిర్ణయాన్ని మార్చకోలేదట.

2009లో సినిమాల్లోకి వచ్చిన స్వసికా, తమిళ చిత్రమైన వాగైతో హీరోయిన్‌(Heroine)గా ఎంట్రీ ఇచ్చారు. తర్వాత అనేక తమిళ, మలయాళ (Tamil, Malayalam) సినిమాల్లో నటించారు. తెలుగులో కూడా ఎటు చూసినా నువ్వే అనే చిన్న సినిమాలో కనిపించారు. మామన్ సినిమాలో సూరీకి అక్క పాత్రలో ఆమె నటన మంచి ప్రశంసలు పొందారు. అదే సమయంలో నితిన్​ నటించిన తమ్ముడు అనే సినిమాలో అడవిలో ట్రక్ డ్రైవర్ పాత్రలో నటించారు. అయితే సినిమాకు అంత మంచి రెస్పాన్స్​ రాకపోవడంతో ఆ పాత్రకు అంత పెద్దగా గుర్తింపు రాలేదు.

Leave a Reply