Makthal | వైభవంగా శ్రీ అయ్యప్ప స్వామి మహా పూజ వేడుకలు

Makthal | వైభవంగా శ్రీ అయ్యప్ప స్వామి మహా పూజ వేడుకలు

  • స్వామివారికి అవబృత స్నానం ధ్వజారోహణ
  • వేడుకల్లో పాల్గొన్న మంత్రి వాకిటి

Makthal | మక్తల్, ఆంధ్రప్రభ : హరిహర పుత్రుడు శబరిమల వాసుడు శ్రీ మణికంఠుడు శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి మహాపూజ వేడుకలు నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరగనున్న మహా పూజ వేడుకల్లో భాగంగా ఇవాళ పట్టణంలోని శ్రీ పడమటి ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ఇటీవల పునరుద్ధరించబడిన పుష్కరిణిలో కోనేటి జలాలతో స్వామివారి ఉత్సవమూర్తికి అవబృత స్నానం చేయించారు. వేద పండితుల మంత్రోశ్చరణలతజ అయ్యప్ప నామస్మరణతో అశోక్ గోడ్, తాళంపల్లి అనిల్ గురుస్వాముల ఆధ్వర్యంలో స్వామివారికి అవబృత స్నానం వేడుక కొనసాగింది.

Makthal

అనంతరం ఆలయ వద్ద గజారోహణంతో మహాపూజ వేడుకలకు అంకురార్పణ జరిగింది. ఈ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి పాల్గొని అయ్యప్ప స్వామి వారికి పాలాభిషేకం చేశారు. మంత్రి మహా పూజ వేడుకల సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అయ్యప్ప స్వామి కృపకు పాత్రులు కావాలని భక్తులకు మంత్రి పిలుపునిచ్చారు. 41 రోజులపాటు దీక్ష చేపట్టిన అయ్యప్ప స్వాములు మకర సంక్రాంతి సందర్భంగా శబరిమలలో మకర జ్యోతితో దీక్షను విరమిస్తారని అయ్యప్ప స్వామి వారు మక్తల్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వానికి తగిన శక్తిని యుక్తిని ఇవ్వాలని, ఈ సందర్భంగా ప్రార్థించినట్లు మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు శ్రీధర్ గౌడ్, నీలగౌడ్, జగదీశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply