Makthal | పదవి కోసం కాదు…

Makthal | పదవి కోసం కాదు…
- ప్రజా సేవ చేసేందుకే సర్పంచ్‌గా పోటీ చేస్తున్న
- భూత్పూర్ సర్పంచ్ అభ్యర్థి సంగీత శేఖర్ గౌడ్
Makthal | మక్తల్, ఆంధ్రప్రభ : గ్రామ అభివృద్ధి కోసం తనను సర్పంచ్‌గా గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ మద్దతు అభ్యర్థి సంగీత శేఖర్ గౌడ్ అన్నారు. పదవి కోసం ఎన్నికల్లో నిలబడలేదని.. ప్రజాసేవ చేసేందుకే బరిలో నిలిచానన్నారు. పెత్తనం చేసేవారు కావాలో.. ప్రజాసేవ చేసేవారు కావాలో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు.
ఈ రోజు తన మద్దతు దారులతో కలిసి గ్రామంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. గడపగడపకూ వెళ్లి ఓటర్లను కలుసుకొని తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. తనను సర్పంచ్‌గా గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. ముంపు గ్రామమైన భూత్పూర్ గ్రామాన్ని పునారవాస కేంద్రంగా ఏర్పాటు చేసినందుకు కృషి చేస్తానన్నారు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే మంత్రి వాకిటి శ్రీహరి నాయకత్వంలో పునరావాసం ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయని అన్నారు.
ప్రచారంలో మాజీ ఎంపిటిసి కే. కురుమయ్య గౌడ్ నాయకులు భీమ్ సేన్ రావు ,రఘుపతి రెడ్డి ,బత్తలయ్య ,వాకిటి నాగప్ప ,చిన్న బాలయ్య ,భీమేష్, రాఘవేందర్ రెడ్డి,చెన్నయ్య గౌడ్, విష్ణువర్థన్ రెడ్డి, జనార్దన్ గౌడ్ ,చిన్న చెన్నయ్య గౌడ్, బొంబాయి నరసింహ,కుర్వ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
