Makthal | కోర్టు ప్రారంభోత్సవం

Makthal | కోర్టు ప్రారంభోత్సవం

  • పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తులు
  • మక్తల్లో కోర్టును ప్రారంభిస్తున్న హైకోర్టు న్యాయమూర్తులు
  • సమావేశంలో మాట్లాడుతున్న హైకోర్టు న్యాయమూర్తి అనిల్ కుమార్ జూకంటి

Makthal | మక్తల్ , ఆంధ్రప్రభ : మక్తల్ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేరుస్తూ మక్తల్ పట్టణంలో నూతనంగా జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ప్రారంభోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. హైకోర్టు న్యాయమూర్తులు అనిల్ కుమార్ జూకంటి, టి. మాధవి దేవి పాల్గొని ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మక్తల్ ప్రాంత ప్రజలకు న్యాయ వ్యవస్థ అందుబాటులోకి రావడం జరిగిందన్నారు. స్థానిక న్యాయవాదులు సత్వర న్యాయం అందించేలా కృషి చేయాలని సూచించారు.

Makthal

మక్తల్ ప్రాంతం ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రాంతం అని హైకోర్టు న్యాయమూర్తి అనిల్ జూకంటి పేర్కొన్నారు .ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఇన్చార్జి ఎస్పీ శ్రీనివాసరావు ,నారాయణపేట జిల్లా జడ్జి బోయ శ్రీనివాసులు, హైకోర్టు సీనియర్ న్యాయవాది దేశాయి ప్రకాశ్ రెడ్డి,నారాయణ పేట బార్ కౌన్సిల్ అధ్యక్షులు దామోదర్ గౌడ్ , స్థానిక న్యాయవాదులు డి .దత్తాత్రేయ ,ఆడెం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా న్యాయమూర్తులకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. కోర్టు ఏర్పాటు కావడం పట్ల ఈ సందర్భంగా పలువురు హర్షం వ్యక్తం చేశారు.మహబూబ్ నగర్,

Leave a Reply