Makthal | ఘనంగా భోగి సంబురాలు

Makthal | ఘనంగా భోగి సంబురాలు

  • భోగి సంబరాల్లో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దంపతులు

Makthal | మక్తల్, ఆంధ్రప్రభ : సంక్రాంతి పండుగ సంబరాల్లో భాగంగా భోగి పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి సందర్భంగా జరిగే భోగి సంబరాల్లో మక్తల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పి.నరసింహ గౌడ్ వారి సతీమణి మాజీ కౌన్సిలర్ పి.ధనలక్ష్మి దంపతులు పాల్గొన్నారు. ఇవాళ‌ పట్టణంలోని రాఘవేంద్ర కాలనీలో తన నివాసంలో గంగిరెద్దుల ప్రదర్శన చేయించి వాటికి వస్త్రదానం చేశారు. పండగ అందరి ఇండ్లలో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించాలని ఈ ప్రాంత ప్రజలు ఎల్లప్పుడూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

Makthal

సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడానికి మకర సంక్రాంతి అని పిలుస్తారని, ఇలాంటి పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరారు. సంస్కృతి సంప్రదాయాలకు నెలవైన తెలుగుజాతిలో రైతులు పంటలు చేతికొచ్చిన సమయంలో వచ్చే సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకుంటారని, ఈ పండగ ప్రతి ఒక్కరి జీవితాల్లో భోగభాగ్యాలను తీసుకురావాలని సిరి సంపదలు వెల్లి విరియాలని, సంబరాలు తీసుకురావాలని, చీకట్లు తొలగి వెలుగులు నిండాలని వారు ఆకాంక్షించారు. గ్రామ గ్రామాన మహిళలు తమ ముంగిట్లో రంగురంగుల రంగవల్లులను తీర్చిదిద్దారు. పలుచోట్ల భోగి మంటలు ఏర్పాటు చేసుకున్నారు. పల్లె ప్రజల పండుగ కావడంతో పల్లెల్లో పండుగ వాతావరణం కనిపిస్తుంది. పల్లె ప్రజలు భోగిమంటలు వేసుకొని ఆనంద ఉత్సవాలతో భోగి వేడుకలు జరుపుకున్నారు.

Leave a Reply