ఒకసారి సర్పంచ్‌గా గెలిపించండి

నల్లబెల్లి, ఆంధ్రప్రభ : సర్పంచ్ అభ్యర్థి లావుడియా రజిత మోతిలాల్ ఓటర్లను కోరుతూ, ఒకసారి తనను గెలిపించాలని శుక్రవారం గ్రామంలో ఇంటింటా ప్రచారం చేశారు. ఆమె ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు హామీ ఇచ్చారు.
ఒకసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే, సర్వసేవకురాలిగా గ్రామ ప్రజలకు సేవ చేస్తానని, ప్రతిరోజూ ప్రజలకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో పెద్ద ఎత్తున మహిళలు, యువకులు పాల్గొని బైక్ ర్యాలీ నిర్వహించారు.
