సర్పంచ్ గా గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తాను

  • అంకిరెడ్డిగూడెం లో శ్రీనివాస్ రెడ్డి ఇంటింటి ప్రచారం

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలంలోని అంకిరెడ్డిగూడెం గ్రామ సర్పంచ్ గా అన్ని వర్గాల మద్దతుతో పోటీ చేస్తున్న తనను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని పర్నె శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం గ్రామంలో ఇంటింటికి తిరిగి హామీ ఇస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.

గ్రామంలోని సమస్యలను పరిష్కరించడం, అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులను అందించడం జరుగుతున్నదని, తనకు కేటాయించిన కత్తెర గుర్తుపై గ్రామస్తులు పెద్ద ఎత్తున ఓట్లు వేస్తే అధిక నిధులను రాబట్టి గ్రామంలోని అన్ని సమస్యలను పరిష్కరించి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని పర్నే శ్రీనివాస్ తెలిపారు.

సర్పంచ్ పోటీ చేస్తున్నారు శ్రీనివాస్ రెడ్డికి భాజపా పూర్తి మద్దతు ఇవ్వడంతో, గ్రామ అభివృద్ధికి ఆయన గెలవడం చాలా ముఖ్యం అని గ్రామస్తులు భావిస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాజపా జిల్లా నాయకులు రమణగోని శంకర్, బత్తుల జంగయ్య గౌడ్, కడారి ఐలయ్య యాదవ్, పార్టీ మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పన, జనసేన మండల పార్టీ అధ్యక్షుడు పర్నే శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply