- అందరు సహకారంతో అభివృద్ధి చేస్తా
- సర్పంచు అభ్యర్థి బీజే రాజేశ్వరి
తాండూరు రూరల్, ఆంధ్రప్రభ : తాండూరు మండలం అంతారం గ్రామ సర్పంచుగా గెలిపించాలని గ్రామ సర్పంచు అభ్యర్థి బీజే రాజేశ్వరి కోరారు. ఈ రోజు గ్రామంలో మహిళలు, యువకులు, అభిమానులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తనకు కేటాయించిన గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.
గ్రామంలో ఎలాంటి సమస్యలు లేకుండా పార్టీలకతీతంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. అందరి సహాకారంతో గ్రామాన్ని ప్రగతి పథం వైపు నడిపిస్తామన్నారు. అందరికి అందుబాటులో ఎలాంటి అవినీతికి తావులేకుండా పనిచేస్తామన్నారు. అంతారంతో పాటు దస్తగిరిపేట్, కొత్త కాలనీ, పీజేఆర్ కాలనీలో ఉన్న సమస్యలను పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఎన్నికల్లో తన గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ అందించాలని విజ్ఞప్తి చేశారు.

