Majority | గ్రామాబివృద్ధే తన లక్ష్యం
Majority | భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : గ్రామ అభివృద్ధే తన లక్ష్యమని, ప్రజలు ఇచ్చే విశ్వాసం, మద్దతుతో గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మెండోరా గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గా బలపరిచిన అభ్యర్థి కుంట లక్ష్మి రమేష్ తెలిపారు. గ్రామ ప్రజలతో కలిసి గ్రామ అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ గ్రామంలో వీధి దీపాలు, మురికి కాలువలు, నీటి సమస్యలాంటి లేకుండా ఎలాంటి సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకొస్తే వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరిస్తానని అన్నారు. మీ అమూల్యమైన ఓటు నాకు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆకర్షిస్తున్నాను.

