మహాత్మ గాంధీ జయంతి వేడుకలు

పాయకాపురం, ఆంధ్రప్రభ: విజయవాడ అజిత్ నగర్ లోని ఎమ్మెల్సీ కార్యాలయం నందు మహాత్మ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గాంధీ చిత్రపటానికి ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కార్యకర్తలకు స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా మహాత్మ గాంధీ నిస్వార్ధ పోరాట ఫలితమే భారతదేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిందని, భారతదేశానికి స్వాతంత్రం తీసుకు వచ్చిన వారిలో ప్రముఖ పాత్ర పోషించిన వారిలో మహాత్మా గాంధీ యొక్క సేవలు చరిత్రలో నిలిచిపోతాయని ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా కొనియాడారు.ఈ కార్యక్రమంలో నెరేళ్ల శివప్రసాద్, రాజు, అమిత్ తదితరులు పాల్గొన్నారు.