కృష్ణపట్నం ఆక్వా రైతులకు మహర్దశ

కృష్ణపట్నం ఆక్వా రైతులకు మహర్దశ

సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.


ముత్తుకూరు, అక్టోబర్ 4 (ఆంధ్రప్రభ) : కూటమి ప్రభుత్వ పరిపాలనలో కృష్ణపట్నం ఆక్వా రైతులకు మహర్దశ పట్టిందని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆక్వా సాగు చేసుకుంటున్న రైతులపై ఎమ్మెల్యే సోమిరెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు.

యూనిట్ విద్యుత్తును 1.50 రూపాయలకు మంజూరు చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఆక్వా రైతులు కలిసి ధన్యవాదాలు తెలుపుతూ ప్రభుత్వానికి రుణపడి ఉన్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేకు ఆత్మీయ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అధికార పార్టీ నాయకులు, తదితరులు ఉన్నారు.