Maharashtra | ఘనంగా మల్లన్న జాతర బోనాలు…
Maharashtra | బోధన్, ఆంధ్రప్రభ : మల్లన్న దీవెనలు తమపై ఉండాలని కోరుకుంటూ బోధన్ మండలం ఊట్ పల్లి గ్రామ మహిళలు బోనం సమర్పించారు. గ్రామంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ ప్రతి సంవత్సరం మల్లన్న స్వామి(Mallanna Swamy) జాతర నిర్వహిస్తారు.
గ్రామంలో ప్రతి ఇంటి నుంచి బోనం తీసుకువచ్చి మల్లన్నకు సమర్పించారు. గ్రామస్తులు సమిష్టిగా(villagers together) నిర్వహించుకునే ఈ జాతరకు బోధన్, మహారాష్ట్ర(Bodhan, Maharashtra) ప్రాంతాల నుంచి కూడా భక్తులు విచ్చేస్తారు.

