MahaKumbhamela – త్రివేణి సంగంలో పవన్ కళ్యాన్ దంపతుల పుణ్య స్నానం
ప్రయాగ రాజ్ – ఎ పీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు హాజరయ్యారు. ఇవాళ మధ్యాహ్నం ప్రయాగ్ రాజ్ చేరుకున్న పవన్..
సతీమణి అన్నా లెజ్నెవా, కుమారుడు అకీరా నందన్ తో కలిసి త్రివేణి సంగం లో పుణ్యస్నానం ఆచరించారు. ఈ సందర్భంగా పవన్ తో పాటు కుటుంబ సభ్యులకు స్థానిక పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. కుంభమేళాలో తొక్కిసలాటలు, అవాంఛనీయ ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో పవన్ కు పుణ్యస్నానం పూర్తయ్యే వరకూ రక్షణగా నిలిచారు.