Madaram | మేడారం జాతర సందర్భంగా….

Madaram | మేడారం జాతర సందర్భంగా….
- రాష్ట్ర ప్రజలకు, భక్తకోటికి మంత్రి సీతక్క శుభాకాంక్షలు..
Madaram | మేడారం, ఆంధ్రప్రభ : మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు తరలివచ్చే కోట్లాది భక్తులందరికీ మంత్రి సీతక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ మహాజాతర ప్రతి భక్తుడి హృదయంలో భక్తి భావాన్ని నింపాలని, జీవితంలో ఎదురయ్యే కష్టాలు తొలగిపోయి శాంతి, ఆనందం కలగాలని ఆమె ఆకాంక్షించారు. సమ్మక్క సారలమ్మ తల్లుల దర్శనంతో ప్రజలందరికీ ఆరోగ్యం, సుఖసంతోషాలు, సమృద్ధి ప్రసాదించాలని ప్రార్థించారు. భక్తుల సౌకర్యం, భద్రత కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని మంత్రి తెలిపారు.
రవాణా, తాగునీరు, వైద్య సదుపాయాలు, పారిశుద్ధ్యం తదితర మౌలిక వసతులు సమకూర్చామని పేర్కొన్నారు. భక్తులందరూ సురక్షితంగా దర్శనం చేసుకుని ప్రశాంతంగా తిరిగి వెళ్లాలని ఆమె కోరారు. సమ్మక్క సారలమ్మ తల్లుల ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరికీ శుభం కలగాలని మంత్రి సీతక్క తన ప్రకటనలో పేర్కొన్నారు.
