Stock markets | మూడో రోజూ నష్టాలే !
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ తిరోగమనంతో ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే ట్రెండ్ కొనసాగించాయి.
దీంతో నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 203 పాయింట్లు నష్టపోయి 75,935 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 19 పాయింట్లు నష్టపోయి 22,913 వద్ద స్థిరపడింది.
శ్రీరామ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, టాటా స్టీల్, టాటా మోటార్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్లుగా ఉన్నాయి.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మారుతీ, టెక్ మహీంద్రా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఐటీసీ టాప్ లూజర్‌లుగా ఉన్నాయి.