AP | 20 మందికి గాయాలు!

AP | 20 మందికి గాయాలు!

ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
బస్సు డ్రైవర్‌తో పాటు ప్రయాణికులకు గాయాలు
క్షతగాత్రులకు సమీప ఆసుపత్రిలో చికిత్స


AP | ఏలూరు, ఆంధ్రప్రభ: ఏలూరు జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీలుగుమిల్లి హైస్కూల్‌ సమీపంలోని జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు సుమారు 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

ఎదురెదురుగా ఢీకొన్న వాహనాలు…

రాజమహేంద్రవరం నుంచి భద్రాచలం వైపు ఆర్టీసీ బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జీలుగుమిల్లి హైస్కూల్‌ సమీపానికి చేరుకోగానే ఎదురుగా వచ్చిన లారీ వేగంగా బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు సుమారు 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.

క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స…

ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పందించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.