tirumala| 4 నుంచి 6 గంటల్లో శ్రీవారి దర్శనం!
4 నుంచి 6 గంటల్లో శ్రీవారి దర్శనం!
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 77,010 మంది భక్తులు
హుండీ ఆదాయం రూ.4.13 కోట్లు
22,826 మంది తలనీలాల సమర్పణ
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 6 కంపార్ట్‌మెంట్లు
తిరుమల, నవంబర్ 2 (ఆంధ్రప్రభ): తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ ప్రస్తుతం సాధారణంగా ఉంది. నవంబర్ 1వ తేదీన మొత్తం 77,010 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 22,826 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. హుండీ ద్వారా రూ.4.13 కోట్ల ఆదాయం సమకూరింది. 3.84 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించారు. అశ్విని ఆస్పత్రిలో 2,430 మందికి వైద్య సేవలు అందించారు.
4 నుంచి 6 గంటల్లో దర్శనం
నవంబర్ 2 ఉదయం నాటికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 6 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం (ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేని భక్తులు) కోసం వచ్చే వారికి స్వామివారి దర్శనానికి సుమారు 4 నుంచి 6 గంటల సమయం పడుతోంది.
గదుల కేటాయింపు వివరాలు
తిరుమలలో నవంబర్ 2 ఉదయం 7.25 గంటల సమయానికి ఆఫ్‌లైన్ వసతి గదుల కేటాయింపులో రూ.50, రూ.100 టారిఫ్ గదులు 210 అందుబాటులో ఉండగా, రూ.1,000, రూ.1,523 టారిఫ్ గదులు 13 అందుబాటులో ఉన్నాయి. గదుల కేటాయింపు అందుబాటును బట్టి ఉంటుందని టీటీడీ తెలిపింది. భక్తులు ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా ముద్రించిన ప్రతిని వెంట తీసుకురావాలని సూచించింది. మరిన్ని వివరాలకు టీటీడీ కాల్ సెంటర్ నంబర్ 155257ను సంప్రదించవచ్చు.
