Lokesh Kanakaraj | ఖైదీ 2 గురించి క్లారిటీ ఇచ్చిన లోకేష్‌ కనకరాజ్..

Lokesh Kanakaraj | ఖైదీ 2 గురించి క్లారిటీ ఇచ్చిన లోకేష్‌ కనకరాజ్..

Lokesh Kanakaraj |ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్‌ కనకరాజ్.. కెరీర్ లో మరచిపోలేని సినిమాల్లో ఒకటి ఖైదీ. ఇంకా చెప్పాలంటే.. లోకేష్‌ కనకరాజ్ కు మంచి పేరు తీసుకువచ్చింది.. టాలీవుడ్ లో (Tollywood) కూడా అతని పేరు మారుమ్రోగేలా చేసింది ఖైదీ సినిమానే. అయితే.. ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని ఎప్పుడో ప్రకటించారు. ఇంత వరకు సెట్స్ పైకి రాలేదు. కూలీ సినిమా తర్వాత లోకేష్‌ చేసేది ఖైదీ 2 అంటూ వార్తలు వచ్చాయి కానీ.. బన్నీతో సినిమాని అనౌన్స్ చేశాడు. ఆతర్వాత ఖైదీ 2 క్యాన్సిల్ అంటూ ప్రచారం జరిగింది. ప్రచారంలో ఉన్న వార్తల పై లోకేష్‌ క్లారిటీ ఇచ్చాడు. ఇంతకీ.. లోకేష్‌ ఏం చెప్పాడు..?

Lokesh Kanakaraj

Lokesh Kanakaraj | నెక్ట్స్ మూవీ విషయంలో కన్ ఫ్యూజన్

లోకేష్‌ కనకరాజ్ తెరకెక్కించిన కూలీ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ అయ్యింది. అప్పటి వరకు లోకేష్ ప్లాప్ అనేది లేకుండా వరుసగా సక్సెస్ సాధించాడు. కూలీ (Coolie) ప్లాప్ అవ్వడంతో నెక్ట్స్ మూవీ విషయంలో కన్ ఫ్యూజన్ ఏర్పడింది. అయితే.. ఎప్పటి నుంచో చేయాలి అనుకుంటున్న ఖైదీ సీక్వెల్ చేస్తాడని వార్తలు వచ్చాయి. కార్తి కూడా ఖైదీ సీక్వెల్ చేయడానికి రెడీగా అన్నాడట. ఏం జరిగిందో ఏమో కానీ.. ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని ప్రచారం జరిగింది. ఇది నిజం కాదేమో.. పుకారేమో.. అనుకున్నారు సినీ జనాలు.

Lokesh Kanakaraj

Lokesh Kanakaraj | ఖైదీ 2 క్యాన్సిల్ అయ్యిందేమో

లోకేష్.. తన నెక్ట్స్ మూవీని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేస్తున్నట్టుగా ప్రకటించి సర్ ఫ్రైజ్ చేశాడు. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ప్రచారంలో ఉన్నట్టుగా ఖైదీ 2 క్యాన్సిల్ అయ్యిందేమో అనుకున్నారు. అయితే.. ఇప్పుడు లోకేష్‌ కనకరాజ్ (Lokesh Kanakaraj) క్లారిటీ ఇచ్చాడు. అల్లు అర్జున్ సార్ తో చేస్తున్న మూవీ కంప్లీట్ అయిన తర్వాత ఖైదీ 2 చేస్తానని ప్రకటించారు. అసలు ఖైదీ 2 ఎందుకు ఆగిందో కూడా బయటపెట్టాడు. ఏం చెప్పాడంటే.. ఖైదీలో ఢిల్లీకి కూతురుగా నటించిన చిన్నారి ఇపుడు బాగా ఎదిగింది. అందుచేత స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఆల్రెడీ కంప్లీట్ చేసిన స్క్రిప్ట్ లో మరిన్ని మార్పులు చేయాల్సి రావడంతో ప్రస్తుతానికి ఆగిందని చెప్పారు. దీంతో ఖైదీ 2 క్యాన్సిల్ కాలేదు.. నెక్ట్స్ లోకేష్ మూవీ ఇదే అని క్లారిటీ వచ్చింది. మరి.. ఖైదీ 2 తో కార్తి – లోకేష్ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.

Lokesh Kanakaraj

CLICK HERE TO READ రణబాలి ఎలా ఉండబోతుందో తెలుసా..?

CLICK HERE TO READ MORE

Leave a Reply