Local Elections | స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే హవా

Local Elections | స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే హవా

మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి…

నిజాంపేట, ఆంధ్రప్రభ : మొదటి విడత ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించిందని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని బీఆర్ఎస్ అభ్యర్థి పాగాలరజిత నగేష్, లకు కత్తెర గుర్తుపై ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… స్థానిక ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతుందని రెండో విడత ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎన్నికల నుండి పతనం మొదలైందని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపిటిసి బాల్రెడ్డి, భాస్కరరావు, వెంకటస్వామి గౌడ్, మోహన్ రెడ్డి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply