Best-Business | Lipi Incకి బెస్ట్ బిజినెస్ అవార్డు

నేటి తరానికి భారతీయ ఇతిహాసాల చేరువకు ప్ర‌శంస‌లు
సినీ హీరో నాగచైతన్య చేతుల మీదుగా అవార్డు స్వీకరణ |

Best-Business | హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ‌ : భారతీయ ఇతిహాసాలు, సంస్కృతి, విలువలను ఆధునిక సాంకేతికతతో కొత్త తరానికి చేరవేస్తున్న Lipi Inc, ప్రతిష్ఠాత్మక Times of India Best Business Awardను అందుకుంది. ప్రముఖ నటుడు నాగచైతన్య చేతుల మీదుగా సంస్థ ఈ అవార్డును స్వీకరించింది.

ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కే టీఆర్ మాట్లాడుతూ, స్టార్టప్‌ల ప్రాధాన్యతను వివరించారు. దేశ ప్రగతిలో స్టార్టప్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని, ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రజలు కూడా స్టార్టప్‌లను ప్రోత్సహించి వాటి అభివృద్ధికి తోడ్పడాలని సందేశమిచ్చారు.

మహాభారతం, రామాయణంలోని కథలు, విలువలు, జీవిత పాఠాలను నేటి తరానికి వారు ఇష్టపడే డిజిటల్ రూపంలో అందించాలనే లక్ష్యంతో Lipi Inc, Lipi Epics appను రూపొందించింది. కథలు, ఆడియోలు, క్విజ్‌లు, ఇంటరాక్టివ్ గేమ్స్, విజువల్ గైడ్స్, రీల్స్, అనిమే తరహా వీడియోల ద్వారా మహాభారతం, రామాయణాన్ని ఆసక్తికరమైన అనుభవంగా మారుస్తోంది Lipi Epics app. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కంటెంట్‌ను అందిస్తూ విభిన్న వయసుల వారికి భారతీయ ఇతిహాసాలను మరింత చేరువ చేస్తోంది.

ఇప్పటికే 3 లక్షల మందికి పైగా వినియోగదారులను చేరుకున్న Lipi, AI ఆధారిత విజువల్స్, గేమిఫికేషన్, ఆధునిక స్టోరీటెల్లింగ్ వంటి సాంకేతికతలను ఉపయోగిస్తూ భారతీయ కథలను కొత్త తరానికి పరిచయం చేస్తోంది. అదే సమయంలో ఇతిహాసాల ప్రామాణికత, మూల విలువలను కాపాడటంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

Times of India Best Business Award తో తాను సాధించిన పురోగతికి గుర్తింపే కాకుండా, భారతీయ జ్ఞాన సంపదను టెక్నాలజీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మరింత మందికి చేరవేయాలనే సంస్థ ప్రయాణంలో Lipi Inc మరో కీలక మైలురాయిగా నిలిచింది.