తెలంగాణలో తేలికపాటి వర్షాలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న రెండు నుంచి మూడు గంటల్లో స్వల్ప వ్యవధి వర్షాలు కురిసే అవకాశం ఉంది. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, రంగారెడ్డి, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే సూచనలు ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలోనూ వాతావరణం మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ హైదరాబాద్ ప్రాంతాల్లో రానున్న రెండు గంటల్లో స్వల్ప జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు తాజా వర్ష సూచన వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం, ఈదురుగాలులు నమోదయ్యే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ కూడా హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు ఉరుములు, మెరుపులు, గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులపై పసుపు హెచ్చరిక జారీ చేసింది
