హెల్మెట్ తో దక్కిన ప్రాణాలు..

ఆంధ్రప్రభ, ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్ జిల్లా : ఎన్టీఆర్ జిల్ల ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హెల్మెట్ ధరించిన ఇద్దరు యువకులు స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కొండపల్లి నుంచి విజయవాడ వెళ్తున్న వాహనాలు బీ కాలనీ వద్ద ఒకదానినొకటి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.

ప్రమాద సమయంలో ఇద్దరు హెల్మెట్ ధరించి ఉండటం వల్ల తలకు తీవ్ర గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. ఒకవైపు హెల్మెట్ మస్ట్ అంటూ ట్రాఫిక్ పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ సంఘటన ప్రతిఒక్క ద్విచక్ర వాహనదారుడికి ఒక స్పష్టమైన సందేశమని ట్రాఫిక్ ఆర్ఎస్సై లక్ష్మణరావు అన్నారు. పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ట్రాఫిక్ డీసీపీ షేక్ షరీనా బేగం సారథ్యంలో సీఐ చంద్రశేఖర్ పర్యవేక్షణలో ఇబ్రహీంపట్నంలో హెల్మెట్ పై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

Leave a Reply