ప్రజల ఆశీర్వాదంతో సర్పంచుగా గెలుస్తా

  • గ్రామాభివృద్ధే ధ్యేయంగా అందుబాటులో ఉంటా
  • సర్పంచు అభ్యర్థి సిరిగిరి పేట్ పండరి

తాండూరు రూరల్, ఆంధ్రప్రభ : తాండూరు మండలం మల్కాపూర్ గ్రామ ప్రజల ఆశీర్వాదంతో సర్పంచుగా గెలిచి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని సర్పంచు అభ్యర్థి సిరిగిరిపేట్ పండరి ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు తన స్నేహితులు, అభిమానులు, యువకులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. తనకు కేటాయించిన బ్యాటు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో ప్రజల ఆదరణ చూస్తుంటే భారీ మెజార్టీతో గెలిపిస్తారని నమ్మకం ఉందన్నారు.

అదే నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని అన్నారు. గ్రామాల్లో అన్ని మౌళిక సదుపాయాలు కల్పించి సమస్యలు లేకుండా చూస్తామన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఇప్పటికే ప్రజల ఆశీర్వాదంతో సర్పంచుగా, సహాకార సంఘం చైర్మన్ గా పనిచేస్తూ ప్రజలకు సేవ చేసేందుకు. అవకాశం కల్పించారని అన్నారు.

Leave a Reply