Delhi | ప్రజల తీర్పును శిరసావహిస్తాం: కేజ్రీవాల్
ఢిల్లీ: ఎన్నికల్లో ఓడినా ప్రజల వెంటే ఉంటామని, ఢిల్లీ ప్రజల తీర్పును శిరసావహిస్తామని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ… నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామన్నారు. పదేళ్లలో ఢిల్లీ ప్రజల కోసం ఎంతో చేశామని చెప్పారు.
విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కోసం ఎంతో కృషి చేసినట్లు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను భాజపా అమలు చేయాలన్నారు. గెలిచిన భాజపా నేతలకు కేజీవాల్ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో గట్టిగా పోరాడిన ఆప్ నేతలు, కార్యకర్తలకూ కేజ్రీవాల్ ధన్యవాదాలు తెలిపారు.