అందరం సమష్టిగా కృషి చేద్దాం : ఏపీ జెన్ కో ఎండీ
ఇబ్రహీంపట్నం (ఎన్టీఆర్ జిల్లా) ఆంధ్రప్రభ : ఎన్టీటీపీఎస్ ఐదో దశలో పవర్ జనరేషన్ పెంచేందుకు ఇంజనీర్లు, ఉద్యోగులు కృషి చేయాలని ఏపీ జెన్ కో ఎండీ నాగలక్ష్మి(AP Gen Co MD Nagalakshmi) సూచించారు. ఎన్టీటీపీఎస్ లో 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన ఐదో దశలో బుధవారం ఆమె పర్యటించారు.
ఇంజనీర్లు, ఉద్యోగుల(Engineers, Employees)తో సమావేశమయ్యారు. ఇంజనీర్లు, ఉద్యోగులు పనితీరును మెరుగుపరుచుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. సంస్థ అధికారులు, ఇంజనీర్లకు పలు సూచనలు చేశారు. ఎండీ వెంట ఏపీ జెన్ కో థర్మల్ డైరెక్టర్ పి.అశోక్ కుమార్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ శివ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

