హిందూ ధర్మ రక్షణకు సంఘటితంగా కృషి చేద్దాం..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; హిందూ ధర్మ రక్షణకు సంఘటితంగా కృషిచేద్దామని నారాయణపేట విహెచ్ పి జిల్లా ఉపాధ్యక్షులు యంగలిరాములు పిలుపునిచ్చారు. మంగళవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోనిచిన్నపోర్ల గ్రామంలో విహెచ్ పి, భజరంగ్ దళ్ నూతన నూతన కమిటీలనుఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో దైవభక్తి దేశభక్తి పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ నడుంబిగించాలనిఅన్నారు.

హిందూ సంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు అందజేసేందుకు కృషి చేద్దామన్నారు. విహెచ్ పి గ్రామ అధ్యక్షులు కోట్ల శ్రీకాంత్ ఉపాధ్యాక్షులు కోట్ల నరేష్ కార్యదర్శిగా పెద్దమోల అనిల్,సహకార్యదర్శిగా వాకిటి నవీన్,కోశాధికారిగా పూలాస్ శ్రీనివాస్,భజరంగ్ దళ్ సంయోజక్ మారేపొల్లా నరేందర్, సహసంయోజక్ గార్లపల్లి గోరక్షా ప్రముఖ్ ఆకుల రామ్ నరేష్ సత్సంగ్ ప్రముఖ్ చిన్నసంజీవ్ సహా సత్సంగ్ ప్రముఖ్ సాయి రామ్ శ్రీనివాస్, భజరంగ్ దళ్ కార్యవర్గం భజరంగ్ దళ్ సంయోజక్ కోట్ల శ్రీనివాస్,సహసంయోజక్, గాండ్ల చంద్రమోహన్,బలోపాసన ప్రముఖ్ అనిల్,విద్యార్ధి ప్రముఖ్ గంజి సురేష్ కుమార్,సేవప్రముక్ దుబ్బనోల నర్సిములు,గోరక్షా ప్రముఖ్ కర్న్ విష్ణు,సప్త హిక్ మిలన్ ప్రముఖ్ శ్రీ నిఖిల్ కార్యవర్గ సభ్యులు బాలకృష్ణ,డి అశోక్ అనిల్,శివా నంద్,చేన్న కేశవ్ శ్రీనివాస్ లను ఎన్నుకొని సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామఉప సర్పంచ్ సంజీవ్,ఊట్కూర్ మండల వి హెచ్ పి అధ్యక్షులు దొబ్బలి భీమ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply