Leopard | జుక్కల్ అడవి ప్రాంతంలో మరో చిరుతపులి సంచారం..

Leopard | జుక్కల్ అడవి ప్రాంతంలో మరో చిరుతపులి సంచారం..
- గ్రామస్తులకు అప్రమత్తం చేస్తున్న ఫారెస్ట్ అధికారులు
- భయాందోళనకు గురవుతున్న ఐదు గ్రామాల ప్రజలు
Leopard | జుక్కల్ (కామారెడ్డి) ఆంధ్రప్రభ : జుక్కల్ అడవి ప్రాంతంలో మరో చిరుతపులి సంచరిస్తుందన్న సమాచారంతో జుక్కల్ మండలంలోని ఐదుగ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రాత్రి పూట పంటపొలాలకు పోవటానికి జంకుతున్నారు. ఇటీవల మగ చిరుతపులి బంగారుపల్లి శివారులో అనుమానాస్పదంగా మృతి చెందడంతో ఫారెస్ట్ అధికారులు పకడ్బందీగా విచారణచేసి ఓ గ్రామానికి చెందిన ఇద్దరువ్యక్తులు చిరుతపులికి విషప్రయోగం చేయటంవల్ల మృతి చెందిందన్నా విషయాన్నితేల్చి వారిద్దరిని అరెస్టు చేయడం జరిగింది.
ఇది ఇలాఉండగా దోస్ పల్లికి చెందిన ఒక కుటుంబానికి చెందిన కుక్క శనివారం రాత్రి మాయం కావడం జరిగిందని, ఆ కుక్కను చిరుతపులి ఎత్తుకోపోయినట్టు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఇతర గ్రామస్తులు కూడా చిరుత సంచరిస్తున్నట్టు అనుమానలను వ్యక్తం చేయటంతో జుక్కల్ ఫారెస్టు అధికారులు అప్రమత్తమయ్యారు.
గ్రామాల వారిగా దోస్ పల్లి సర్పంచ్ ఆడేమారుతి, మైబాపూర్ సర్పంచ్ భర్త అశోక్ రెడ్డి, బంగారుపల్లి సర్పంచ్ భర్త మనిక్ రావుపాటిల్ ఆధ్వర్యంలో గ్రామస్తులతో సమావేశన్నీ ఏర్పాటు చేసిన జుక్కల్ ఎఫ్అర్ఓ సంతోష, డిఆర్ఓ సుజాత, బీట్ ఆఫీసర్ రాములు ప్రజలకు అప్రమత్తం చేశారు. దీంతోపాటు పలు జాగ్రత్తలు,సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది.
చిరుతపులికి సంబంధించి ఎలాంటి సమాచారం తెలిసిన నిర్భయంగా గ్రామస్థులు తమకు సమాచారం అందించాలని ఫారెస్ట్ అధికారులు గ్రామస్తులకు సూచించారు. దీంతోపాటు దోస్ పల్లి, మైబాపూర్, సిద్ధాపూర్, బంగారుపల్లి, బస్వాపూర్ గ్రామాలలో దండోరా వేయించినట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
