Lenin | అదే నిజమైతే.. అఖిల్ రిస్క్ చేస్తున్నట్టే..?

Lenin | అదే నిజమైతే.. అఖిల్ రిస్క్ చేస్తున్నట్టే..?
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లెనిన్. ఈ మూవీకి డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు. సైలెంట్ గా షూటింగ్(Silent shooting) జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కి రెడీ అయ్యింది. అందుకనే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. అయితే.. ఈ మూవీలో అఖిల్ ఊహించని పాత్రలో కనిపించబోతున్నాడని ఫిల్మ్ నగర్(Film Nagar) లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ.. అఖిల్ చేస్తున్న ఊహించని పాత్ర ఏంటి..?
Lenin | అంథుడుగా అఖిల్..

లెనిన్ మూవీ గ్రామీణ నేపథ్యంలో సీమ కథతో(With the story of Seema) రూపొందుతోంది. ఈ సినిమాలో అఖిల్ పాత్ర పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే.. ఈ సినిమాలో అఖిల్ పాత్ర దృష్టి లోపంతో ఉంటుందని.. ఆ కారణంగా అఖిల్ పడే ఇబ్బందుల నేపథ్యంలో సాగే ఎమోషనల్ డ్రామా జనాలకు బాగా కనెక్ట్ అవుతుందని అంటున్నారు. ఎలాంటి లీకులు లేకుండా ఇప్పటి వరకు షూటింగ్ జరుపుకుంది. ఇప్పుడు ఈ విషయం లీక్ అయ్యింది. రాయలసీమ బ్యాక్ డ్రాప్(Rayalaseema backdrop) తో రూపొందుతోన్న ఈ సినిమాలో అఖిల్ ని ఓ పవర్ పుల్ పాత్రలో చూపిస్తున్నట్లే ప్రచారం జరిగింది. కానీ.. ఇలా దృష్టి లోపం ఉంటుందని మాత్రం ఇప్పుడు లీకవ్వడంతో ఇది హాట్ టాపిక్ అయ్యింది. ఇదే కనుక నిజమైతే అఖిల్.. రిస్క్ చేస్తున్నట్టే. అలాగే అఖిల్ కు ఇది ఛాలెంజే అని చెప్పచ్చు.
Lenin | ప్రమోషన్స్ స్టార్ట్..

అయితే.. దృష్టి లోపమా? లేక.. పూర్తిగా అంధుడిగా కనిపిస్తాడా..? లేక కథ మధ్యలో అంధుడు అవుతాడా..? అనేది ఆసక్తిగా మారింది. రాజా ది గ్రేట్ సినిమాలో మాస్ రాజా రవితేజ(Mass Raja Ravi Teja in the movie) కూడా అంధుడి పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. అనీల్ రావిపూడి తనదైన మార్క్ ట్రీట్ మెంట్ తో హిట్ చేసాడు. రవితేజ అందుడి పాత్ర పోషించడం ఏంటనే కామెంట్లు వచ్చాయి కానీ.. సినిమా చూసిన తర్వాత ఎలాంటి విమర్శలు రాలేదు. డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడు.. అఖిల్ ఎలా పర్ ఫార్మ్ చేశాడు..? అనేది మరింతగా క్యూరియాసిటీని పెంచేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ సింగిల్ రిలీజ్(First single release) చేశారు. ఇక నుంచి ప్రమోషన్స్ లో స్పీడు పెంచనున్నారు. మార్చిలో లెనిన్ రిలీజ్ కి రెడీ అవుతుంది. మరి.. అఖిల్ ఆశించిన బ్లాక్ బస్టర్ లెనిన్ ఇస్తుందేమో చూడాలి.

