రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు
అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ: రాప్తాడులో టెన్త్ బాలికపై రంపంతో దాడి చేసిన ఉన్మాది హేమంత్ కుడి కాలును డాక్టర్లు తొలగించారు. పోలీసుల కాల్పుల్లో అతని కాలికి బుల్లెట్ గాయాలు కాగా రక్తప్రసరణ ఆగిపోయింది. దీంతో గ్యాంగ్రీన్ ఏర్పడగా, అలాగే వదిలిస్తే మిగతా భాగాల కణజాలం దెబ్బతిని ప్రాణాపాయం ఉంటుందని వైద్యులు చెప్పారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలతో అనంతపురం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో అర్ధరాత్రి తర్వాత సర్జరీ చేసి మోకాలు కిందిభాగం తొలగించారు. ఎడమ కాలికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం హేమంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.
