Laxmi l అభివృద్ధికి చిరునామా మళ్లీ కాంగ్రెస్…

Laxmi l అభివృద్ధికి చిరునామా మళ్లీ కాంగ్రెస్…
49వ డివిజన్ లో లక్ష్మీప్రసన్న గెలుపు తథ్యం..
Laxmi l మహబూబ్ నగర్, ఆంధ్ర ప్రభ: 49వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఇక అనివార్యమని రాజకీయ విశ్లేషకులు, ప్రజాసంఘాల నేతలు, డివిజన్ ప్రజలు స్పష్టంగా చెబుతున్నారు. ఎన్నికల ప్రచారం ఆరంభం నుంచే కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీప్రసన్న ఆనంద్ కుమార్ గౌడ్ కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుండగా, ఆమె విజయం కేవలం సమయప్రశ్న మాత్రమేనని స్థానిక రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ సతీమణిగా కాకుండా, ప్రజాసేవలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నాయకురాలిగా లక్ష్మీప్రసన్న ముందుకు సాగుతున్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
మాజీ మున్సిపల్ చైర్మన్‌గా ఆనంద్ కుమార్ గౌడ్ బాధ్యతలు నిర్వహించిన సమయంలో డివిజన్ పరిధిలోని అన్ని వర్గాల ప్రజలకు ఆయన ఎప్పుడూ అందుబాటులో ఉండేవారని, ఎలాంటి తేడాలు లేకుండా ప్రతి ఒక్కరి సమస్యను స్వయంగా అడిగి తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేశారని స్థానికులు గుర్తుచేస్తున్నారు. ఎప్పుడు పిలిచినా నేరుగా ప్రజల వద్దకే వచ్చి సమస్యలు విన్న నాయకత్వం ఇప్పుడు అరుదుగా మారిందని, అలాంటి నాయకుడిని మళ్లీ ప్రజాప్రతినిధిగా గెలిపించుకుంటే అభివృద్ధి ఫలాలు ఇంటి ముంగిటే ఉంటాయని ఓటర్లు బలమైన నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
డివిజన్‌లో మౌలిక వసతుల అభివృద్ధి
, కాలనీల సమస్యలు, డ్రైనేజీ, రోడ్లు, తాగునీరు వంటి కీలక అంశాలపై ఆనంద్ కుమార్ గౌడ్ హయాంలో జరిగిన పనులు ఇప్పటికీ ప్రజలకు గుర్తున్నాయని, అదే అభివృద్ధి పరంపర కొనసాగాలంటే లక్ష్మీప్రసన్నను కార్పొరేటర్‌గా గెలిపించాల్సిన అవసరం ఉందని డివిజన్ వాసులు స్పష్టం చేస్తున్నారు. ప్రజల మధ్య తిరుగుతూ, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే నాయకత్వం ఉండడం వల్లే కాంగ్రెస్‌పై నమ్మకం మరింత బలపడిందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో 49వ డివిజన్‌లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా గట్టి పోటీ కనిపించడంలేదని, ప్రజల మనసు ఇప్పటికే కాంగ్రెస్ వైపే మొగ్గు చూపిందని స్థానికులు చెబుతున్నారు. అభివృద్ధికి ఓటు వేయాలన్న స్పష్టమైన నిర్ణయంతో ప్రజలు ముందుకు సాగుతుండటంతో, ఈ డివిజన్‌లో కాంగ్రెస్ విజయం ఖాయమనే వాతావరణం నెలకొందని రాజకీయ వర్గాలు తేల్చి చెబుతున్నాయి.
