ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : చెక్ బౌన్స్ కేసులో కోర్టు కమిషన్ తరపున ఎన్‌బీడ‌బ్ల్యూ నోటీసులు ఇవ్వ‌డానికి వెళ్లిన ఆదిలాబాద్ (Adilabad) న్యాయవాదులు కౌషిక్ సింగ్, మనోజ్ లపై నిన్న‌ రాత్రి నిందితులు దాడి చేసి గాయపరిచారు. విధి నిర్వహణలో న్యాయవాదులపై నిందితుల దాడిని ఖండిస్తూ ఈరోజు ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ (Adilabad Bar Association) ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కోర్టుతో పాటు అన్నికోర్టుల విధులను న్యాయవాదులు (Lawyers) బహిష్కరించారు.

నిందితులు సోపన్ కాంబ్లే, వర్షా కాంబ్లే లను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ (Remand) కు తరలించాలని, న్యాయవాదులకు ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని బార్ అసోసియేషన్ (Bar Association) అధ్యక్షులు ఎండ్రాల నగేష్, ప్రధాన కార్యదర్శి డీఎస్పీ శర్మ, ఉపాధ్యక్షులు చందు సింగ్ డిమాండ్ చేశారు. ఈ దాడిని బార్ అసోసియేషన్ కార్యవర్గం తీవ్రంగా ఖండించారు. కోర్టు ప్రధాన గేటు వద్ద నల్లబ్యాడ్జిలతో నిరసన (Protest) ప్రదర్శన చేపట్టారు. దాడి చేసిన నిందితులకు ఎవరూ న్యాయ సహాయం అందించకూడదని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు అసోసియేషన్ నాయకులు తెలిపారు. అనంతరం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

Leave a Reply