Latest OTT Releases |ఈ రోజు అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్‌కు సిద్ధం..

ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్‌: థియేటర్లలో సందడి చేసిన సూపర్‌ హిట్‌ సినిమాలు ఇప్పుడు ఓటీటీ వేదికలపై అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రతి వారం లాగే ఈ వారం కూడా పలు భాషలకు చెందిన సినిమాలు డిజిటల్‌ స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు నాలుగు సినిమాలు ఓటీటీలో అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇందులో మలయాళం, తెలుగు నుంచి సూపర్‌ హిట్‌ సినిమాలు ఉన్నాయి.

‘బెత్లెహెం కుటుంబ యూనిట్‌’.. జియో హాట్‌స్టార్‌లో

మలయాళ చిత్రం ‘బెత్లెహెం కుటుంబ యూనిట్‌’ ఈరోజు నుంచి ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ** భాషల్లో అందుబాటులో ఉంది. ఈ సినిమాను జియో హాట్‌స్టార్‌ వేదికగా వీక్షించవచ్చు. కుటుంబ కథాంశాలతో తెరకెక్కే మలయాళ సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అదే తరహాలో ఈ చిత్రం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే అంచనాలు ఉన్నాయి.

‘మహేంద్రగిరి వరాహి’.. ప్రైమ్‌ వీడియోలో

తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మరో చిత్రం ‘మహేంద్రగిరి వరాహి’ కూడా ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది.తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ చిత్రం అందుబాటులో ఉంది. విభిన్న కథాంశంతో రూపొందిన ఈ సినిమాకు ఓటీటీ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

కన్నడ సినిమా ‘మదర్‌ ప్రామిస్‌’.. జీ5లో

కన్నడ చిత్రం ‘మదర్‌ ప్రామిస్‌’ కూడా డిజిటల్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా జీ5 వేదికపై స్ట్రీమింగ్‌ అవుతోంది. కన్నడ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందిన ఈ చిత్రం కుటుంబ భావోద్వేగాలను ప్రధానంగా చూపిస్తుంది.

‘పూజా మేరీ జాన్‌’.. జీ5లో హిందీ మూవీ

హిందీ చిత్రం పూజా మేరీ జాన్‌ కూడా ఈరోజు నుంచి ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్‌ అవుతోంది. క్రైమ్‌, ఎమోషనల్‌ డ్రామా అంశాలతో రూపొందిన ఈ చిత్రం హిందీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.