Tirumala: శ్రీవారి సర్వదర్శన తాజా అప్‌డేట్స్.. 6 గంటల్లో స్వామివారి దర్శనం!

తిరుమల (నవంబర్ 05, 2026) ఆంధ్రప్రభ: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ ఈరోజు సాధారణంగా ఉంది. గురువారం (05-11-2026) ఉదయం సమాచారం ప్రకారం.. శ్రీవారి ఉచిత సర్వదర్శనం కోసం వేచి ఉండే భక్తులకు సుమారు 6 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు. టోకెన్లు లేని భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు.

అదేవిధంగా తిరుమలలో వసతి గృహాల (గదుల) లభ్యత వివరాలను పరిశీలిస్తే.. ఈరోజు ఉదయం 7:33 గంటల సమయానికి భక్తులకు ₹50 మరియు ₹100 రుసుము కలిగిన సాధారణ గదులు 389 అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే, భక్తుల రద్దీ దృష్ట్యా ₹1,000 మరియు ₹1,523 కేటగిరీలకు చెందిన గదులు పూర్తిగా నిండిపోవడంతో ప్రస్తుతం ఏవీ అందుబాటులో లేవని స్పష్టం చేశారు. తిరుమలకు వచ్చే భక్తులు ఈ వివరాలను గమనించి, దానికి అనుగుణంగా తమ ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకోవాలని టీటీడీ సూచిస్తోంది.