ఉట్నూర్, ఆంధ్రప్రభ : హైదరాబాదులోని సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి ధర్నా కార్యక్రమానికి తరలిరావాలని లంబాడ హక్కుల (Lambada Rights) పోరాట సమితి రాష్ట్ర సంఘం పిలుపుమేరకు ఆ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ చవాన్ ఆధ్వర్యంలో ఉట్నూర్ చెందిన లంబాడ నాయకులు ఈ రోజు హైదరాబాదు తరలి వెళ్తున్నారు. మార్గమధ్యలో ఉట్నూర్ ఎస్సై (Utnoor SI) ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు, నాయకులను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ఉట్నూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్భంగా లంబాడకుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ చవాన్ (Bharat Chavan) మాట్లాడుతూ… తమ హక్కులను డిమాండ్ చేయడానికి న్యాయపరంగా వెళుతుంటే పోలీసులు అడ్డుకొని అరెస్టు చేయడం సరికాదని అన్నారు. ప్రభుత్వం పోలీసులచే నిర్బంధించడంఫై ఆయన ఖండించారు. అరెస్టు అయిన వారిలో లంబాడ హక్కుల పోరాట సమితి నాయకులు పవర్ గంగారాం నాయక్, జాదవ్ మధుకర్ నాయక్,చంద్రకాంత్ నాయక్, కాశినాథ్ రాథోడ్,ఆడే రవీందర్, ఉన్నారు.

Leave a Reply