( కాణిపాకం, ఆంధ్రప్రభ ) : కాణిపాకం (Kanipakam) వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు తెప్పోత్సవం సందర్భంగా 21కిలోల మహా ప్రసాదం లడ్డును వేలంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. హైదరాబాద్ (Hyderabad) కు చెందిన వికలాంగుల కల్యాణ వేదిక సుభాష్ గుప్తా వినాయక స్వామి లడ్డూను రూ. 6,25,000లకు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ (Kalikiri Muralimohan), దేవస్థానం ఈవో పెంచల కిషోర్, ఏఈఓ రవీంద్రబాబు, ప్రసాద్ ఆలయ మాజీ చైర్మన్ మణి నాయుడు, కాణిపాకం మాజీ సర్పంచ్ మధుసూదన్ రావు, పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.

Leave a Reply